కేవలం ఒక్క అవకాశం… ఒకరి జీవితాన్నే మార్చేస్తుంది! అలాంటి అవకాశం 13 వేల మందికి వచ్చింది. కానీ అందులో నుంచి ఇప్పుడు టీమిండియా భవిష్యత్ ఫాస్ట్ బౌలర్లుగా నిలిచేందుకు నలుగురు యువతులు దూసుకొస్తున్నారు! అక్షితా భగత్, పాలక్ సింగ్, రోహితా చౌదరి, జోష్నా ఏంజెల్… వీళ్లంతా W P L Speed Queen Talent Hunt ద్వారా వెలుగులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్లు. ఈ టాలెంట్ హంట్‌లో ఏకంగా 13 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో సుమారు 7,500 మంది ట్రయల్స్‌కు వచ్చారు. చివరికి 56 మంది ఫైనల్స్‌కు చేరుకున్నారు.
అక్కడ తమ స్పీడ్, ఫిట్‌నెస్, టాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ నలుగురికి ఇప్పుడు మరో పెద్ద అవకాశం దక్కింది. B C C I Centre of Excellence లో బెస్ట్ కోచ్‌ల దగ్గర ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. అందులో ముందుగా పెద్ద అడుగు వేసింది 19 ఏళ్ల అక్షితా భగత్. మొహాలీకి చెందిన అక్షితా ఇటీవల ఆస్ట్రేలియా ఏ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఇండియా ఏ జట్టులో చోటు సంపాదించింది. ఇంట్రెస్టింగ్ విషయము ఏంటంటే… అక్షితా మొదట బ్యాటర్! ఆ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ వైపు వచ్చింది.
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమెకు రోల్ మోడల్. ఇక 15 ఏళ్ల జోష్నా ఏంజెల్ ఏకంగా 108 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. చెన్నైకి చెందిన జోష్నాకు క్రికెట్, బౌలింగ్ రెండూ తన తండ్రి నుంచే పరిచయమయ్యాయి. ఆమె లక్ష్యం మాత్రం చాలా క్లియర్… “నేను ఇండియా తరఫున ఆడాలి” అంటోంది! మరో 15 ఏళ్ల యువ బౌలర్ పాలక్ సింగ్ కూడా 108 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అభిమానించే పాలక్…
ఇప్పుడు ఇండియా U-19 జట్టులో చోటు కోసం చూస్తోంది. ఇక 24 ఏళ్ల రోహితా చౌదరి కథ మరింత ఆసక్తికరం. ఆమె మొదట హెప్టాథ్లెట్. అథ్లెటిక్స్ నుంచి క్రికెట్‌లోకి వచ్చిన రోహితా ట్రయల్స్‌లో 109 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. కర్ణాటక సీనియర్ జట్టులో చోటు కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో Speed Queen అవకాశం ఆమెకు కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ నలుగురూ B C C I Centre of Excellence లో ట్రైనింగ్, తీసుకుంటున్నారు. వీళ్ల స్పీడ్ చూస్తుంటే… భవిష్యత్‌లో టీమిండియా జెర్సీలో ఈ నలుగురినీ చూడటం అసాధ్యమేమీ కాదు!


