జూలై 23 నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయి. అయితే ఈసారి అభిమానులను ఆశ్చర్యపరిచే విషయము ఏమిటంటే… క్రికెట్ ఈ గేమ్స్‌లో లేదు. క్రికెట్‌తో పాటు హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్ వంటి ప్రముఖ క్రీడలకు కూడా చోటు దక్కలేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 19 క్రీడలు నిర్వహించారు. కానీ ఈసారి గ్లాస్గోలో మాత్రం 10 క్రీడలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో భారత్‌కు పతకాల అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.
అయితే 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? దీనికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులు మరియు సమయం లేకపోవడం. మొదట 2026 కామన్వెల్త్ గేమ్స్‌ను ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం నిర్వహించాల్సి ఉంది. కానీ ఖర్చులు భారీగా పెరగడంతో 2023లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో స్కాట్లాండ్లోని గ్లాస్గో కొత్త ఆతిథ్య నగరంగా ఎంపికైంది. అయితే నిర్వాహకులకు సిద్ధం కావడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటంతో… ఖర్చులను తగ్గించేందుకు 19 క్రీడలను 10 క్రీడలకు పరిమితం చేశారు.
అందుకే క్రికెట్‌తో పాటు మరికొన్ని క్రీడలను తొలగించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ గతంలో ఎప్పుడు జరిగింది? కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ తొలిసారి 1998లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగింది. అప్పుడు పురుషుల వన్డే ఫార్మాట్ మాత్రమే నిర్వహించారు. మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో దక్షిణాఫ్రికా, కెప్టెన్ షాన్ పోలాక్ నాయకత్వంలో ఆస్ట్రేలియాను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. న్యూజిలాండ్ శ్రీలంకను ఓడించి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత 24 సంవత్సరాల విరామం తర్వాత 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ మళ్లీ వచ్చింది. ఈసారి మహిళల టీ twenty టోర్నమెంట్ రూపంలో నిర్వహించారు. మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ జట్టుకు స్వర్ణ పతకం దక్కగా… భారత్ రజత పతకం సాధించింది.
న్యూజిలాండ్ కాంస్య పతకం గెలుచుకుంది. 2026 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఏయే క్రీడలను తొలగించారు? క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, ట్రైయాథ్లాన్, రెజ్లింగ్, బీచ్ వాలీబాల్, రగ్బీ సెవెన్స్… మొత్తం 9 క్రీడలను తొలగించారు. అయితే ఈసారి నిర్వహించనున్న 10 క్రీడలు ఇవే… అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, లాన్ బౌల్స్, నెట్‌బాల్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, జూడో, బాక్సింగ్. భారత్‌కు పెద్ద దెబ్బ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 30 పతకాలు ఇప్పుడు తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి. రెజ్లింగ్‌లో 12, టేబుల్ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, హాకీలో 2, స్క్వాష్‌లో 2, క్రికెట్లో 1 పతకం భారత్ గెలుచుకుంది. అంతేకాదు… భారత్‌కు బలమైన క్రీడలైన షూటింగ్ మరియు ఆర్చరీ ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ కార్యక్రమంలో లేవు. అందుకే ఈసారి భారత్‌కు పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.


