టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ V V S లక్ష్మణ్.. భారత జట్టు హెడ్ కోచ్ పదవిని ఎందుకు తిరస్కరించాడో తాజాగా వెల్లడించాడు. 2024లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. ఆ స్థానాన్ని లక్ష్మణ్‌తో భర్తీ చేయాలని BCCI భావించింది. కానీ లక్ష్మణ్ మాత్రం ఆ అవకాశం వచ్చినా.. హెడ్ కోచ్ పదవిని తీసుకోలేదు. అసలు ఎందుకు? దాని వెనుక కారణం ఏంటి? 2024లో టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు.
దీంతో కొత్త కోచ్ కోసం BCCI ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సమయంలో VVS లక్ష్మణ్‌ను కూడా సంప్రదించింది. అయితే లక్ష్మణ్ మాత్రం హెడ్ కోచ్ పదవి కంటే.. BCCI Centre of Excellence అంటే C o E లో తన పని కొనసాగించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇటీవల C o E లో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. BCCI తనకు తన ఆలోచనలను అమలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పాడు. అందుకే మరో రెండేళ్ల పాటు C o E లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
అంతేకాదు.. తన కుటుంబానికి సంబంధించిన కారణాలు కూడా హెడ్ కోచ్ పదవిని తీసుకోకపోవడానికి ఒక కారణమని లక్ష్మణ్ గతంలో చెప్పాడు. అయితే లక్ష్మణ్‌కు C o Eపై ప్రత్యేకమైన విజన్ ఉంది. 2021లో రాహుల్ ద్రవిడ్ N C A నుంచి టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లిన తర్వాత.. ఆ బాధ్యతలను V V S లక్ష్మణ్ తీసుకున్నాడు. ఇప్పుడు N C A నే Centre of Excellence గా మార్చారు. C o E లో సరైన structure, processes, protocols ఏర్పాటు చేసి.. దాన్ని మరింత బలమైన వ్యవస్థగా తయారు చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లాలని లక్ష్మణ్ భావిస్తున్నాడు.
అందుకే 2026 వరకు తన tenure ను కొనసాగించాలని BCCI తో ఒప్పందం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం లక్ష్మణ్ పేరు మరో కీలక BCCI పదవికి కూడా వినిపిస్తోంది. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి tenure సెప్టెంబర్‌లో ముగియనుండటంతో.. ఆ తర్వాత ఆ స్థానానికి లక్ష్మణ్‌ను పరిశీలించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే తన భవిష్యత్తుపై లక్ష్మణ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చాలా మంది టీమిండియా ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి C o E లో ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు అక్కడే రికవరీ అవుతున్నారు. దీంతో C o E పై వస్తున్న విమర్శలకు కూడా లక్ష్మణ్ స్పందించాడు. C o E అనేది కేవలం గాయపడిన ఆటగాళ్లకు చికిత్స చేసే rehab centre మాత్రమే కాదని స్పష్టం చేశాడు. క్రికెటర్లు మరింత మెరుగ్గా ఎదగడానికి.. వారి ఆటను అభివృద్ధి చేసుకోవడానికి C o E లో ఇంకా చాలా ముఖ్యమైన పనులు జరుగుతున్నాయని చెప్పాడు. అలాగే ఆటగాళ్ల గాయాలకు recovery time ఎప్పుడూ ఒకేలా ఉండదని లక్ష్మణ్ వివరించాడు. ఎందుకంటే మనిషి శరీరం ఒక machine కాదని.. ప్రతి ఆటగాడి recovery ఒక్కో విధంగా ఉంటుందని చెప్పాడు.
C o E, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య మంచి communication ఉందని కూడా లక్ష్మణ్ తెలిపాడు. ఆటగాళ్లు పూర్తిగా fitness సాధించిన తర్వాతే తిరిగి జట్టులోకి పంపిస్తున్నామని చెప్పాడు. యువ క్రికెటర్లను అభివృద్ధి చేయడం, మహిళల క్రికెట్‌పై కూడా దృష్టి పెట్టడం తన tenureలో ముఖ్యమైన విషయాలని లక్ష్మణ్ చెప్పాడు. ట్రోఫీలు అనేవి మనం ఏర్పాటు చేసే మంచి systems, processes వల్ల వచ్చే ఫలితాలని ఆయన పేర్కొన్నాడు.
మరి.. 2024లో టీమిండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశం వచ్చినా V V S లక్ష్మణ్ ఎందుకు వద్దన్నాడనే దానిపై మీ అభిప్రాయం ఏంటి? “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”


