Top 5 This Week

Related Posts

జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు.. క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు!

టీ twenty క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ది హండ్రెడ్ 2026 టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బట్లర్ కేవలం 11 బంతుల్లో 16 పరుగులే చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. అయితే ఈ 16 పరుగులే అతడిని టీ twenty క్రికెట్ చరిత్రలో కొత్త స్థానానికి చేర్చాయి. ఈ పరుగులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి, టీ twenty ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ 487 ఇన్నింగ్స్‌లో మొత్తం 14,572 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 146.74.

ఈ ప్రయాణంలో 102 అర్ధసెంచరీలు, 9 సెంచరీలు నమోదు చేశాడు. మరోవైపు క్రిస్ గేల్ 455 ఇన్నింగ్స్‌లో 14,562 పరుగులతో ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. గేల్ తన కెరీర్‌లో 88 అర్ధసెంచరీలు, 22 సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం టీ twenty ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతని ఖాతాలో 14,803 పరుగులు ఉన్నాయి. బట్లర్ ఇప్పుడు పొలార్డ్ రికార్డును అధిగమించాలంటే ఇంకా 231 పరుగులు మాత్రమే అవసరం. ఈ ఘనత బట్లర్‌కు మరింత ప్రత్యేకం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా అతను తీవ్ర ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐసీసీ టీ twenty ప్రపంచకప్‌లో కూడా బట్లర్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు.

ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేసి, సగటు 10.67తో టోర్నీని ముగించాడు. అయితే 2026లో బట్లర్ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన బట్లర్ 526 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతని స్ట్రైక్‌రేట్ 152.46గా నమోదైంది. అదే జోరును అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కొనసాగించాడు. భారత్‌తో జరిగిన చివరి టీ twenty మ్యాచ్‌లో కేవలం 64 బంతుల్లో అజేయంగా 131 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. పురుషుల టీ twenty అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే కావడం విశేషం. టీ twenty అంతర్జాతీయ కెరీర్‌లో కూడా బట్లర్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.

ఇప్పటివరకు 160 మ్యాచ్‌ల్లో 4,212 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధసెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. టీ twenty అంతర్జాతీయాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందున్న వారు పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. అంతేకాదు, టీ twenty అంతర్జాతీయాల్లో 3,000 పరుగులు, 4,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఇంగ్లండ్ బ్యాటర్ కూడా జోస్ బట్లర్ కావడం విశేషం. మొత్తానికి… ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ బట్లర్ ఇప్పుడు వరుస రికార్డులతో మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. మరి మరో 231 పరుగులు చేసి కీరన్ పొలార్డ్‌ను కూడా అధిగమించి టీ twenty ల్లో, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles