మహిళల క్రికెట్‌లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత జట్టులో ప్రియా పూనియాకు అవకాశం లభించింది. అసలు ప్రియా పూనియా ఎవరు? ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియా ఓపెనర్ ప్రతికా రావల్ గాయం కారణంగా ఈ టెస్టు మ్యాచ్‌కు దూరమైంది. ఇంగ్లాండ్-ఏతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆమె కుడి మోకాలికి గాయం అయింది. గాయం తీవ్రంగా ఉండటంతో కుట్లు కూడా వేశారు. దీంతో ఆమె పూర్తిగా కోలుకోకపోవడంతో లార్డ్స్ టెస్టుకు అందుబాటులో లేకపోయింది. ఈ విషయాన్ని భారత మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ అధికారికంగా వెల్లడించారు.
ప్రతికా రావల్ స్థానంలో ప్రియా పూనియాను జట్టులోకి తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రియా పూనియా గురించి తెలుసుకుందాం. ప్రియా పూనియా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన క్రికెటర్. ఆమె కుడిచేతి టాప్ ఆర్డర్ బ్యాటర్. అవసరమైతే రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ప్రియా ఇప్పటికే భారత జట్టు తరఫున వన్డేలు, టీ twenty మ్యాచ్‌లు ఆడింది. అయితే ఇప్పటివరకు టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు లార్డ్స్ టెస్టుతో ఆమె టెస్టు అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రియా పూనియా 2019 ఫిబ్రవరి 6న న్యూజిలాండ్‌పై జరిగిన టీ twenty, match తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల ఇంగ్లాండ్-ఏతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున ఆమె అద్భుతంగా రాణించింది. తొలి మ్యాచ్‌లో 23 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో 87 పరుగులు, మూడో మ్యాచ్‌లో 61 పరుగులు చేసింది. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 171 పరుగులు చేసి ఇండియా-ఏ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె అద్భుత ప్రదర్శనతో ఇండియా-ఏ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది.
అదే ప్రదర్శన ఇప్పుడు ఆమెకు భారత టెస్టు జట్టులో అవకాశం తీసుకొచ్చింది. ప్రియా అంతర్జాతీయ కెరీర్‌ను చూస్తే.. ఇప్పటివరకు 12 మహిళల వన్డేల్లో 273 పరుగులు చేసింది. బ్యాటింగ్ సగటు 27.30. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ నాటౌట్ 75. టీ twenty ల్లో మూడు మ్యాచ్‌లు ఆడి 9 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ టెస్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, రెణుకా ఠాకూర్‌తో పాటు ఇప్పుడు ప్రియా పూనియాకు కూడా చోటు దక్కింది. మరి ఇండియా-ఏలో అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రియా పూనియా ఈ అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటుందో చూడాలి.
లార్డ్స్ లాంటి చారిత్రాత్మక మైదానంలో ఆమె టెస్టు అరంగేట్రం చేస్తే అది ఆమె కెరీర్‌లో మరచిపోలేని క్షణంగా నిలిచిపోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రియా పూనియా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత జట్టులో స్థానం పక్కా చేసుకుంటుందా? కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి తాజా క్రికెట్ వార్తల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి.


