Top 5 This Week

Related Posts

సంజూ శాంసన్‌ను తప్పించే సమయం వచ్చిందా? వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జట్టు మేనేజ్‌మెంట్ నుంచి పెద్దగా ఒత్తిడి కనిపించకపోయినా, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి మాత్రం విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి.దీనికి ప్రధాన కారణం ఆయన ఇటీవల వరుసగా విఫలం కావడమే. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ twenty మ్యాచ్‌ల్లో సంజూ 5, 0 పరుగులకే ఔటయ్యారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ twentyలో కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇలా వరుసగా తక్కువ స్కోర్లు చేయడంతో ఆయన స్థానం గురించి చర్చ మొదలైంది.

 ఇదే సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్  ఇర్ఫాన్ పఠాన్  సంజూ బ్యాటింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన టెక్నికల్ లోపాన్ని వివరించారు.ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ… బౌలర్లు సంజూ శాంసన్‌కు ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తే అతనికి ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఎందుకంటే సంజూ బ్యాట్ ఫేస్ పూర్తిగా ఓపెన్‌గా ఉండదని, కొంత మూసి ఉండటం వల్ల ఆఫ్ సైడ్‌లో షాట్ ఆడేటప్పుడు బ్యాట్ సరైన కోణంలో రాదని అన్నారు. అందుకే ఎడ్జ్ తీసుకుని క్యాచ్ ఇవ్వడం లేదా బంతి స్టంప్స్‌ను తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.

 ఈ మాటలకు ఇటీవల జరిగిన మ్యాచ్‌లే ఉదాహరణగా నిలిచాయి.ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ twentyలో సంజూ ఆఫ్ సైడ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తగిలి నేరుగా స్టంప్స్‌ను తాకింది. అలాగే ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ twentyలో కూడా ఆఫ్ స్టంప్ బయట వేసిన బంతిని భారీ షాట్ ఆడాలని ప్రయత్నించి థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.

 దీంతో సంజూ టెక్నిక్‌పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో ఆయనకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఆ సిరీస్‌ను భారత్ అనూహ్యంగా 2-0తో కోల్పోయింది.

 అయితే ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఆయన 16 మ్యాచ్‌ల్లో మొత్తం 776 పరుగులు చేశాడు. అంతేకాదు దాదాపు 237 స్ట్రైక్‌రేట్ తో బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. ఆ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడి అవార్డును కూడా అందుకున్నాడు.

 వైభవ్ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్  సాబా కరీమ్ కూడా ప్రశంసలు కురిపించారు.ఆయన మాట్లాడుతూ… ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుతమైన సీజన్ తర్వాత అంతగా గుర్తుండిపోయే సీజన్ ఏదైనా ఉంటే అది వైభవ్ సూర్యవంశీదేనని అన్నారు. ప్రపంచ స్థాయి బౌలర్లపై అతను చూపించిన ఆత్మవిశ్వాసం, దూకుడు నిజంగా అద్భుతమని కొనియాడారు.

 వైభవ్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, భారత అభిమానులతో పాటు ప్రపంచమంతా అతని అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పారు.అంతేకాదు, త్వరలోనే వైభవ్ టీ twentyలతో పాటు వన్డేలు, టెస్టులు… ఇలా మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడనే పూర్తి నమ్మకం తనకు ఉందని సాబా కరీమ్ అభిప్రాయపడ్డారు.

 ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లాండ్‌తో మిగిలిన టీ twenty మ్యాచ్‌లపైనే ఉంది. సంజూ శాంసన్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెబుతారా? లేక వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles